»105mm Indian Field Guns Used For First Time For Independence Day Ceremonial Gun Salute
77th Independence Day: ఆగస్టు 15సందర్భంగా తొలిసారి 105 ఎంఎం ఇండియన్ ఫీల్డ్ గన్ సెల్యూట్
నేడు దేశం మొత్తం 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంది. స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా 21 గన్ సెల్యూట్ చేశారు.
77th Independence Day: నేడు దేశం మొత్తం 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంది. స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా 21 గన్ సెల్యూట్ చేశారు. అయితే ఈ ఏడాది స్వదేశీ తుపాకుల నుంచి గౌరవ వందనం స్వీకరించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని నరేంద్ర మోడీ కలలుగన్న ‘మేక్ ఇన్ ఇండియా’ను సాకారం చేస్తూ ఈ ఏడాది స్వదేశీ 105 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్లను వినియోగించారు. భారతీయ ఆర్మీ అధికారి మాట్లాడుతూ “ఈరోజు సెరిమోనియల్ సెల్యూట్లో భాగంగా 105 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్స్‌ని కాల్చారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉత్సవ కాల్పులకు ఈ స్వదేశీ తుపాకులను ఉపయోగించడం ఇదే మొదటిసారి.”
జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం
భారతదేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రాత్మక ఎర్రకోట ప్రాకారంపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోడీ తన ప్రసంగంలో దేశ బలగాలను కొనియాడారు. భారతదేశ ఆర్థిక వృద్ధి దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేసిందని, భారత సైనికులు యుద్ధానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలా రక్షణ సంస్కరణలు నిరంతరం కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.
వరుస బాంబు పేలుళ్ల రోజులు ముగిశాయి
ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “నా ప్రియమైన కుటుంబ సభ్యులారా.. గతంలో బాంబు పేలుళ్ల సంఘటనల గురించి మనం అప్పుడప్పుడు వింటున్నాం. బాంబు భయం గురించి ప్రజలను అప్రమత్తం చేసే ప్రకటనలు ఉన్నాయి. ఒక దేశం సురక్షితంగా ఉన్నప్పుడు.. అది స్థిరమైన పురోగతిని సాధిస్తుంది. వరుస బాంబు దాడుల రోజులు ముగిశాయి.”
#WATCH | Delhi | 105 mm Light Field Guns firing as part of the ceremonial salute today. This is the first time that these indigenous guns have been used for ceremonial firing at the #IndependenceDay celebrations.