AP: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసులో హీరో అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట లభించింది. తమపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని అల్లు అర్జున్, మాజీ MLA రవిచంద్రకిశోర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టులో విచారణ జరిగింది. నవంబర్ 6 వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 6న తగిన ఉత్తర్వులిస్తామని కోర్టు తెలిపింది.