KDP: దీపావళికి సంబంధించిన టపాసుల దుకాణాల ఏర్పాటు కోసం పులివెందులలో ఉన్న పోలీస్, ఫైర్, మున్సిపాలిటీ అధికారులతో ఆర్డీఓ భాను సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేని ప్రాంతాల్లో దుకాణాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ధరలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.