CT R: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నిత్యాన్నదానానికి కడప వాస్తవ్యులు గజ్జల దినేష్ రెడ్డి రూ.5,00,116ను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా విరాళాన్ని ఏఈవో రవీంద్రబాబుకు శుక్రవారం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి పాల్గొన్నారు.