TG: సియోల్లో హన్ రివర్ అభివృద్ధిపై అధ్యయనం చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మూసీ పునర్జీవంపై ప్రభుత్వానికి స్పష్టత ఉందన్నారు. సియోల్ నగరానికి హన్ రివర్ ఆదాయ వనరు అని పేర్కొన్నారు. మూసీ పునర్జీవనంతో ఎవరికీ అన్యాయం జరగదని అన్నారు. మూసీ రివర్బెడ్ కింద ఉన్నవారికి.. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చామని, రూ.2 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నట్లు చెప్పారు. మూసీపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.