TG: ఆదిలాబాద్‌లో పత్తి రైతులు ఆందోళన విరమించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కలెక్టర్‌తో మాట్లాడారు. క్వింటాల్‌కు రూ.6,696 ఇచ్చేందుకు వ్యాపారులు అంగీకారం తెలిపారు. తేమతో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా.. పత్తి ధర తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.