దేశ రాజధాని ఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు 19 ఏళ్ల యువతిని గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోవాలని అడగ్గా స్నేహితులతో కలిసి యువతిని హత్య చేసి పాతిపెట్టాడు. యువతి కనిపించడంలేదని ఫిర్యాదు అందిన పోలీసులు విషయం తెలుసుకొని ప్రధాన నిందితుడు సహా ఇద్దరిని అరెస్టు చేశారు. మరొకరి కోసం గాలింపు చేపట్టారు.