ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి ప్రయత్నం జరిగింది. వికాస్పురిలో పాదయాత్ర చేస్తుండగా దుండగులు దాడికి యత్నించారు. ఈ దాడిని ఆ రాష్ట్ర సీఎం అతీషి, ఆప్ నాయకులు కేజ్రీవాల్‌పై దాడిని ఖండించారు. ఈ దాడి బీజేపీ పనేనని, కేజ్రీవాల్‌ను ఆ పార్టీ శత్రువుగా చూస్తోందంటూ ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్‌కు ఏమి జరిగినా అందుకు బీజేపీ బాధ్యత వహించాలని మంత్రి సౌరవ్ భరద్వాజ్ అన్నారు.