బాబా సిద్ధిఖీ హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సిద్ధిఖీని చంపేందుకు నిందితులు మూడు తుపాకులు వాడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తాజాగా నాలుగు తుపాకులు వినియోగించనట్లు స్పష్టం చేశారు. ఈ తుపాకులను పాకిస్థాన్ నుంచి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. డ్రోన్ సాయంతో బార్డర్ దాటించి వాటిని తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం తుపాకుల ఫొటోలను రాజస్థాన్‌కు పంపారు.