TG: ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా తన ఫ్యామిలీ మెంబర్లతో కలిశారు. తనకు పీసీసీ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం 30 నిమిషాలు పాటు తెలంగాణ రాజకీయాలపై చర్చించారు. పీసీసీ నూతన కార్యకవర్గం, ఎమ్మెల్సీ ఎన్నికల అంశాలపై చర్చించినట్లు సమాచారం. దీంతో పాటు కుల గణన అంశాన్ని కూడా కేసీ ఆరా తీసినట్లు తెలిసింది.