ఇండోనేషియా ఆపిల్ ఐ-ఫోన్లను నిషేధించింది. ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లు ఇండోనేషియా సరిహద్దులోపల కనిపిస్తే చట్ట విరుద్ధమని ఆ దేశ పరిశ్రమలశాఖ మంత్రి అగస్ గుమీవాంగ్ కర్టాసాష్మిత ప్రకటించారు. విదేశాల నుంచి ఫోన్లు కొనుగోలు చేయొద్దని యూజర్లను హెచ్చరించారు. ఇండోనేషియాలో పెట్టుబడులు పెడతామని ఇచ్చిన హామీలను ఆపిల్ నిలబెట్టుకోనందు వల్లే నిషేధం విధించినట్లు తెలుస్తోంది.