AP: విశాఖ మహానగరాన్ని మరింత అభివృద్ది చేస్తామని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. దేశంలో ఆర్థికంగా అభివృద్ది చెందుతున్న నగరం విశాఖ అని తెలిపారు. నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ఇన్ఫోసిస్, TCS కంపెనీలు వస్తున్నాయని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టును త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో వ్యవస్థలను పక్కదారి పట్టించారని మండిపడ్డారు.