పాకిస్థాన్ వికెట్ కీపర్, బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 2000 పరుగుల మైలు రాయిని అందుకున్న వాడిగా రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఈ రికార్డు సాధించాడు. కేవలం 57 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని అందుకున్నాడు. గతంలో వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్(59 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది.