ELR: పశువుల సమగ్ర సమాచారాన్ని అధికారులకు అందించి పశుగణానికి సంబంధించిన వివిధ పథకాల అభివృద్ధికి ప్రజలు దోహదపడాలని ఎంపీడీవో కిరణ్ కుమార్ అన్నారు. కొయ్యలగూడెం మండలం పరింపూడి పశువైద్యశాలలో 21వ అఖిలభారత పశుగణన కార్యక్రమాన్ని పశువైద్యాధికారి బి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పరిగణ కర్తలకు శిక్షణ, సూచనలు మరియు సంఖ్యా గణన కిట్లు అందించారు.