రాంగోపాల్ వర్మ తాజా థ్రిల్లర్ సినిమా ‘శారీ’. ఈ మూవీకి గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రం RGV, AARVI బ్యానర్లో నిర్మిస్తున్నారు. కాగా తెలుగు, తమిళ్, మళయాలం, హిందీలో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 20న విడుదల కానుంది. ఈ సినిమా గురించి RGV మాట్లాడుతూ.. సోషల్ మీడియా భయానక రిలేషన్స్‌కు తెరలేపుతుందన్నారు. వీటి ద్వారా అమ్మాయిల్లో విచ్చలవిడి తనం పెరిగి నిజాలను గ్రహించలేక పోతున్నారన్నారు.