ASR: కొయ్యూరు పోలీసు స్టేషన్లో ఎస్సైగా పనిచేసి, ఇటీవల బదిలీపై వెళ్లిన ఎస్సై రామకృష్ణను సస్పెండ్ చేస్తూ విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొయ్యూరులో పనిచేస్తున్న సమయంలో ఈ ఏడాది జూలై 4న 20కిలోల గంజాయితో పట్టుబడిన ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేయకుండా వారి నుంచి రూ.1,25,000 ఆన్లైన్లో లంచం తీసుకున్న ఘటనలో ఆయనను సస్పెండ్ చేశారు.