మన్యం: ఏనుగుల దాడిలో మృతి చెందిన యాకోబ్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయంను ఎమ్మెల్యే విజయ్ చంద్ర శుక్రవారం అందజేశారు. ఈ సందర్బంగా వారి కుటుంబాన్ని పరామర్శించి, వృద్ధుడు మృతి చెందడం చాలా బాధాకరమని, ఆయన లేని లోటు తీర్చలేమని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరు ఎటువంటి ఇబ్బంది పడకూడదన్న ఆశయంతో ప్రభుత్వం చేయూత అందించి అండగా నిలుస్తుందన్నారు.