VZM: మానవతామూర్తి కీ.శే.రతన్ టాటా జ్ఞాపకార్ధం గాంధీ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఈనెల 29న స్థానిక SVN లేక్ పేలస్లో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు డా.MVN వెంకటరావు తెలిపారు. శుక్రవారం దీనికి సంభందించిన పోస్టర్లును విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అందరు భాగస్వాములు కావాలని కోరారు. ఇందులో అబ్దుల్ రవూఫ్ తదితరులు పాల్గొన్నారు.