NLR: ఈ నెల 25 నుండి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు చేపట్టనున్న పశుగణనకు సంబందించిన 21వ అఖిల భారత పశుగణన పోస్టర్ను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శుక్రవారం రాత్రి కావలి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పశుగణన విషయ సేకరణకు మీ ఇంటికి వచ్చే వారికి పశువుల సమగ్ర సమాచారం అందించాలని కోరారు.