టెలికాం సంస్థ రిలయన్స్ జియో దీపావళి ధమాకా ఆఫర్లు తీసుకొచ్చింది. పండగ సందర్భంగా ఎంపిక చేసిన రూ.899, రూ.3,599 ప్లాన్లపై రూ.3350 విలువైన ప్రయోజనాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. రూ.3 వేలు విలువ చేసే ఈజీ మై ట్రిప్ వోచర్, రూ.999 కంటే ఎక్కువ మొత్తంతో ఎజియోలో షాపింగ్ చేసేవారికి కూపన్ వర్తిస్తుంది. అలాగే, రూ.150 విలువైన స్విగ్గీ వోచర్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్ నవంబర్ 3వ తేదీలోపు రీఛార్జ్ చేసుకున్న వారికి మాత్రమే లభిస్తుంది.