NRL: ఉదయగిరి ఎంఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఆంధ్రపదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయ్ మెంట్ ఆఫీస్, సీడాప్ సంయుక్తంగా నిర్వహించిన జాబ్ మేళాలో 23 మంది ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ ఆకుల నరసింహారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన జాబ్ మేళాలో 52 మంది అభ్యర్థులు పాల్గొన్నారని చెప్పారు.