ఢిల్లీ పొల్యూషన్పై సీజేఐ చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో పొల్యూషన్ వల్ల మార్నింగ్ వాక్కు వెళ్లడం లేదని తెలిపారు. సుప్రీంకోర్టు ఆవరణలో నిన్న కొందరు జర్నలిస్టులతో ఆయన ముచ్చటించారు. ఇటీవల డాక్టర్లను కలిస్తే వారు పగటి పూట బయటకు వెళ్లొద్దని చెప్పినట్లు తెలిపారు. శ్వాసకోస వ్యాధులు వస్తాయని చెప్పడంతో మార్నింగ్ వాక్ ఆపేశానని వెల్లడించారు. కాగా.. ఆయన నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు.