కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన తల్లి సరోజ కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. సుదీప్ కుటుంబానికి సినీ ప్రముఖులతో పాటు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.