ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘స్పిరిట్’. పోలీస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి కరీనా కపూర్ నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపై కరీనా స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని ఓ టాక్ షోలో స్పష్టం చేసింది. ‘స్పిరిట్’ మూవీకి సంబంధించి ఎవరు కూడా తనని సంప్రదించలేదని తెలిపింది. ఒకవేళ ఈ సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని పేర్కొంది.