రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ పనులు ప్రారంభమయ్యాయని సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ పోస్ట్ పెట్టాడు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూట్ ప్రారంభం కానుందని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.