NTR, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన దేవర సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో కొరటాల శివ ఈ మూవీ చూసిన ప్రేక్షకుల మదిలో పార్ట్ 2పై కొన్ని సందేహాలు కలిగేలా చేశాడు. అసలు దేవరను ఎవరు చంపారు..? నీటిలో ఉన్న అస్థిపంజరాలు ఎవరివి..? మత్తులో ఉన్న దేవర అంతమందిని ఎలా చంపగలిగాడు..? అనే అనుమానాలను రేకెత్తించాడు. మరి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే పార్ట్ 2 వచ్చేదాకా ఆగాల్సిందే.