యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ మూవీ జనవరి 12, 2024లో రిలీజై భారీ విజయం అందుకుంది. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ మూవీ రాబోతుంది. తాజాగా ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. హనుమంతుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.