VZM: జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు ప్రకారం డెంకాడ పోలీస్ స్టేషన్ పరిదిలో నాతవలస హైవే కూడలిలో ఆటో వాహన చోదకుల మత్తు పదార్థాలు, గంజాయి పై ఎస్సై ఏ.సన్యాసి నాయుడు, సిబ్బందితో శుక్రవారం అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలు సేవించి వాహనం నడపకూడదని సూచించారు. గంజాయి అక్రమ రవాణాకు ప్రోత్సహించకూడదని హితవు పలికారు. పిల్లలపట్ల శ్రద్ధ వహించాలన్నారు.