TG: మాజీమంత్రి హరీశ్ రావుకి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. ‘మల్లన్నసాగర్కి కేసీఆర్, మాజీమంత్రులను తీసుకురండి. సీఎం రేవంత్ రెడ్డి కూడా వస్తారు. మూసీ నిర్వాసితులని BRS రెచ్చగొడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఉన్న ఏ డ్యామ్ వద్దకైనా రావటానికి మేం సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే కాళేశ్వరంపై చర్చకు రండి’ అని సవాల్ విసిరారు.