కర్నూలు: ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం వ్యవసాయ మార్కెట్ యార్డుకు సాధన తనిఖీల్లో వచ్చి ఏటీఎం నారాయణమూర్తికి వినతి పత్రాన్ని సమర్పించారు. మార్కెట్లో రైతులకు వర్షం వచ్చినప్పుడల్లా ఇబ్బందులు తప్పడంలేదన్నారు.