న్యూజిలాండ్ జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో భారత్ ఆటగాళ్లు దూకుడుగా ఆడుతున్నారు. భారత్ ఓపెనర్లు తొలి వికెట్కు 72 పరుగులు జోడించారు. యశస్వి జైస్వాల్(35) పరుగులు చేసి వెనుదిరిగాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(52) అర్ధ శతకం చేసి దూకుడుగా ఆడుతూ ఆజాజ్ పటేల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ(40), సర్ఫారాజ్(43) దాటిగా ఆడుతున్నారు. 33 ఓవర్లకు టీమిండియా 172/2 పరుగులు చేసింది.