తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో దర్శకుడు శివ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘కంగువ’. తాజాగా ఈ మూవీ ఆడియో లాంచ్కు డేట్ ఖరారైంది. అక్టోబర్ 26న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. నవంబర్ 14న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో జగపతిబాబు, బాబీ డియోల్, దిశా పటాని తదితరులు కీలక పాత్రలు పోషించారు.