తూ.గో: సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప.గో జిల్లా తణుకు మండలం పైడిపర్రుకు చెందిన వెంకటేశ్వర రావు (60), దుర్గ(50) కొవ్వూరు మండలం మద్దూరులో జరిగే శుభకార్యానికి బైకుపై బయల్దేరారు. ఈక్రమంలో నిడదవోలు మండలం గోపవరం వద్ద ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో భార్యాభర్తలు అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.