స్టార్ హీరో సూర్య.. ఇండస్ట్రీకి రావడానికి గల కారణాన్ని తాజాగా వివరించారు. ‘మా నాన్నకు తెలియకుండా అమ్మ బ్యాంక్లో రూ.25వేలు లోన్ తీసుకున్నట్లు నాతో చెప్పింది. ఆ లోన్ తీర్చడం కోసమే మణిరత్నం సినిమాలో అవకాశం రాగానే అంగీకరించా. నేను చిత్ర పరిశ్రమలోకి రావాలని… నటుడిగా ఎదగాలని కలలో కూడా అనుకోలేదు. కానీ సూర్యగా మీ అందరి అభిమానాన్ని సంపాదించుకున్నాను’ అని చెప్పారు.