ఈ మధ్య వస్తున్న సినిమాలు ఓ వారం రోజులు థియేటర్లో నిలబడాలంటే.. సాలిడ్ కంటెంట్ కావాలి. ఒకవేళ ఆ కంటెంట్‌కు జనాలు కనెక్ట్ అయితే.. సినిమా హిట్ అవడమే కాదు.. భారీగా లాభాలను తెచ్చిపెడుతుంది. కానీ ఇప్పుడు ఓటిటి అందుబాటులోకి వచ్చాక.. ఇంట్లోనే సగటు ప్రేక్షకుడికి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది. కాబట్టి థియేటర్‌కి జనం రావాలంటే.. ఖచ్చితంగా సరికొత్త కంటెంట్‌తో రావాల్సిందే.
రీసెంట్గా వచ్చిన సమంత ‘యశోద’ కూడా కొత్తగా.. సరికొత్త కంటెంట్‌తో మెప్పించిందనే టాక్ అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే కలెక్షన్ల పరంగా యశోద వెనకబడిపోయిందని అంటున్నాయి ట్రేట్ వర్గాలు. హరీ, హరీష్ దర్శకత్వం వహించిన యశోద.. సరోగసీ కాన్సెప్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా నవంబర్ 11 రిలీజ్ అయింది. వీకెండ్ సమంతకు కలిసొచ్చినా.. సోమవారం నుంచి కలెక్షన్లు భారీగా డ్రాప్ అయ్యాయని ట్రేడ్ వర్గాలంటున్నాయి. అన్ని భాషల్లోనూ కలెక్షన్స్ పరిస్థితి అలానే ఉందట. మొత్తంగా..
వీకెండ్‌తో పోలిస్తే కేవలం 40 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ, కలెక్షన్స్ కనపడినట్లు తెలుస్తోంది. ఇలాగే ఉంటే.. యశోద బ్రేక్ ఈవెన్ కష్టమే అంటున్నారు. అయితే ఓవర్సీస్లో యశోదకు భారీ వసూళ్లు వస్తున్నట్టు తెలుస్తోంది. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 5 లక్షల డాలర్స్ మార్క్ ని చేరుకొని హాఫ్ మిలియన్ క్లబ్లో ఎంటర్ అయిందంటున్నారు. ఇటు ఇండియాలోను పెద్ద సినిమాలు లేకపోవడంతో.. ఈ వీకెండ్లో పుంజుకుంటుందని అంటున్నారు. మరి బాక్సాఫీస్ దగ్గర యశోద ఎలా సత్తా చాటుతుందో చూడాలి.