Vijay Devarakonda: ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న విజయ్ ఫ్యామిలీ స్టార్
విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరుశురామ్ కాంబినేషన్లో వస్తున్న మూవీకి ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. నిన్న విడుదల చేసిన ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ కాగా.. యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తుంది. మీరు ఇంకా చూడకుంటే ఓసారి చూసేయండి మరి.
Vijay Devarakonda Family Starr Movie Glimpses Trending
Vijay Devarakonda: గీత గోవిందం కాంబో విజయ్ దేవరకొండ(Geethaagovindam), దర్శకుడు పరుశురామ్(Parasuram) తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్(Family Starr). ఈ చిత్రంలో విజయ్‌కి తోడుగా మృణాల్ ఠాకూర్(Mrunal Takhur) నటిస్తోంది. దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల షూటింగ్ మొదలు పెట్టుకుని శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. తొలుత ఈ చిత్రానికి కుటుంబరావు అనే టైటిల్ పెడుతున్నట్లు కొన్ని రోజులు సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఫైనల్‌గా విజయ్ ఇమేజ్‌కు తగ్గట్లు ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్‌ను ఖారారు చేసి నిన్న గ్లింప్స్ విడుదల చేశారు.
ఈ మూవీలో విజయ్ దేవరకొండ పూర్తి ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించబోతున్నాడు. తండ్రిగా, భర్తగా ఒక కొత్త రోల్ లో విజయ్ ఆడియన్స్ ని థ్రిల్ చేయబోతున్నాడు. గ్లింప్స్(Glimps)లోనే చూపించాడు..మార్నింగ్ లేచి పాపను రెడీ చేసి స్కూల్‌కు పంపిస్తే తప్పేంటి అని, ఐరన్ వంచి మరి ఫైట్ చేశాడంటే సినిమాలో కావల్సినంత యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందనేది తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ గ్లింప్స్ యూట్యూబ్‌లో టాప్ 2 ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. ఇప్పటికే 4.9 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీంతో ఈసారి గీతాగోవిందం లాంటి డీసెంట్ ఫ్మామిలీ హిట్ పడటం ఖాయమని విజయ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా తరువాత విజయ్, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ ఉన్న విషయం తెలిసిందే.