Vijay Devarakonda: విజయ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. బర్త్ డే ట్రీట్ ఒకటి కాదు, రెండు కాదు?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు సూపర్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. తన బర్త్ డే సందర్భంగా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాల అప్టేట్స్ బయటికి రానున్నట్టుగా తెలుస్తోంది. దీంతో రౌడీ ఫ్యాన్స్ రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు.

  • Written By:
  • Publish Date - May 8, 2024 / 06:16 PM IST

Vijay Devarakonda: ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ హంగామా చేస్తున్నారు. మే 9న రౌడీ బర్త్ డే ఉండండంతో.. గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈసారి ఫ్యాన్స్‌కు రౌడీ కూడా ట్రిపుల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవల విజయ్ నుంచి వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా అభిమానులను నిరాశపరిచింది. దీంతో నెక్స్ట్ సినిమాలతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు రౌడీ. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైనప్‍లో మూడు సినిమాలు ఉన్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. బర్త్ డే సందర్భంగా.. ఈ సినిమా టైటిల్‍ను రివీల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇక ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు కూడా ఓకె చెప్పాడు విజయ్.

చదవండి:Salar: మరొక యూనివర్స్‌తో సలార్ క్రాస్ ఓవర్.. ఎన్టీఆర్‌ సినిమానే?

ఫ్యామిలీ స్టార్ తర్వాత నిర్మాత దిల్‍ రాజుతో మరో సినిమా చేయబోతున్నాడు. రాజా వారు రాణిగారు ఫేమ్ డైరెక్టర్ రవికిరణ్ కోలా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు రౌడీ బర్త్ డే నాడు బయటికి రానున్నాయి. ఇక టాక్సీవాలా కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్‌తో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా బర్త్ డే గిఫ్ట్‌గా రానుందని అంటున్నారు. ఈ మూవీ రాయలసీమ బ్యాక్‍డ్రాప్‍లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని సమాచారం. దీంతో.. మే 9న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పొచ్చు. మరి ఈ సినిమాలతో విజయ్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

చదవండి:Sai Pallavi: ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ పని మాత్రం చెయ్యను?

Related News

Vijay Devarakonda: మూవీ ప్రమోషన్స్ కోసం విజయ్, రష్మికలను వాడుకుంటున్నారా?

రౌడీ హీరో విజయ్, నేషనల్ క్రష్ రష్మిక.. ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇఫ్పుడు వారు తమ రిలేషన్ ని.. మూవీ ప్రమోషన్స్ కి వాడేసుకుంటున్నారనే కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి.