ఎవరైనా సరే.. ఒక్కసారి ట్రోలర్స్ కంట పడితే ఇక అంతే సంగతులు. తమ క్రియేటివిటీ మొత్తాన్ని ట్రోల్స్ రూపంలో బయటపెడుతుంటారు సదరు ట్రోలర్స్. అవి చూసి జనాలు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే ట్రోల్స్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ అప్ కమింగ్ హీరోను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు ట్రోల్స్ రాయుళ్లు.. అయితే రాను రాను సీన్ రివర్స్ అయ్యేలా ఉంది.. దాంతో ఎంత ఖర్చు పెట్టిన రాని పబ్లిసిటీ వచ్చేలా ఉందంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ కవర్ సాంగ్.. తన కొడుక్కి హీరోగా రెండు ఛాన్సులు తీసుకొచ్చిందని.. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ తన కొడుకు చంద్రహాస్‌ను ఓ ప్రెస్ మీట్ పెట్టి ఇంట్రడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రెస్ మీట్లో చంద్రహాసన్ ఆటిట్యూడ్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చంద్రహాసన్ చిన్న పిల్లాడి చేష్టలతో ట్రోలర్స్‌కు టార్గెట్ అయ్యాడు. దాంతో యూట్యూబ్‌లో ఎన్నో ట్రోలింగ్ వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు ట్రోలర్స్ పై ప్రభాకర్ రివేంజ్ తీర్చుకునేలా ఓ వీడియో రిలీజ్ చేసినట్టు చూపించి మరింత ట్రోల్ చేస్తున్నారు. అయితే చంద్రహాస్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఎగ్జైట్మెంట్లో కాస్త అటిట్యూడ్ చూపించి ఉండొచ్చు.. కానీ ఇలా ట్రోల్స్ చేస్తారని ఊహించి ఉండడు. ఇదే ఇప్పుడు ఆ కుర్రాడికి ఫ్రీ పబ్లిసిటీని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ట్రోల్స్ ఎలా చేసినా.. అది నెగిటివ్ యాంగిల్ అయినా.. చంద్రహాస్‌కు మాత్రం పీక్స్‌లో పబ్లిసిటీ జరిగిందనే చెప్పాలి. దాంతో ఊహించని విధంగా సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యాడు చంద్రహాస్. మొత్తంగా అప్పుడప్పుడు ట్రోలింగ్ ఇలా కూడా కలిసొస్తుందని చెప్పొచ్చు.