కెజియఫ్ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించి.. కలెక్షన్ల వర్షం కురించాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు సలార్‌ను కూడా రెండు భాగాలుగా తీసుకొచ్చి.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రభాస్ లాంటి కటౌట్‌కి సాలిడ్ మాస్ సినిమా పడితే ఎలా ఉంటుందో.. సలార్‌తో చూడబోతున్నామని.. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ చెప్పకనే చెప్పేసింది. కాకపోతే కాస్త లేట్‌గా ఈ సినిమా థియేటర్లోకి రానుంది. సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడిన సలార్.. నవంబర్ లేదా డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటికే సలార్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది.
ప్రజెంట్ ప్రశాంత్ నీల్ ఫోకస్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీదే ఉంది. కానీ ఇలాంటి సమయంలో సలార్ మళ్లీ షూటింగ్ అనే న్యూస్ వైరల్‌గా మారింది. షూటింగ్ అంటే రీ షూట్ అనుకునేరు.. థియేటర్ షేక్ అయ్యే మ్యాటర్ వేరే ఉంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. ప్రభాస్ ఇండియాలో ఉండి ఉంటే ఈపాటికే ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయి ఉండేదట. కానీ ప్రస్తుతం డార్లింగ్ విదేశాల్లో ఉన్నాడు. మోకాలి సర్జరీ చేయించుకున్నాడనే టాక్ కూడా ఉంది. అందుకే ప్రభాస్ కోలుకొని తిరిగొచ్చిన వెంటనే.. ఈ స్పెషల్ సాంగ్‌ను షూట్ చేయాలని చూస్తున్నాడట.
ఈ సాంగ్‌ని చాలా గ్రాండ్‌గా డిజైన్ చేస్తున్నాడట. అందుకోసం స్టార్ హీరోయిన్ల పేర్లని పరిశీలిస్తున్నాడట. అది కూడా సీనియర్ హీరోయిన్లను ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. త్రిష, ఐశ్యర్య రాయ్‌తో ఈ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. దీంతో ఈ సీనియర్ హీరోయిన్లతో ఐటెం సాంగ్ ఏందిరా? బాబు అనే కామెంట్స్ వినిస్తున్నాయి. సలార్‌లో స్పెషల్ సాంగ్ ఉంటే ఉండొచ్చు కానీ.. ఐశ్వర్య రాయ్‌తో అంటేనే నమ్మశక్యంగా లేదు.