మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’ దుమ్ముదులిపేస్తోంది. దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం.. భారీ బ్లాక్ బస్టర్‌గా దిశగా దూసుకుపోతోంది. దాంతో గాడ్ ఫాదర్ డైరెక్టర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనేది.. ఇంట్రెస్టింగ్గా మారింది. అది కూడా రేసులో ఇద్దరు స్టార్ హీరోలు ఉండడంతో మరింత ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల్లోనే 69 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసిన గాడ్ ఫాదర్.. మూడో రోజు 20 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు తెలుస్తోంది. మొత్తంగా మూడు రోజుల్లోనే 80 కోట్ల వసూళ్ళు వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాల టాక్.
ఇక ఈ రీమేక్ ఈ సినిమాను.. తనదైన స్టైల్లో తెరకెక్కించి మెప్పించాడు డైరెక్టర్ మోహన్ రాజా. దాంతో ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలు మోహన్ రాజాతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇప్పటికే కింగ్ నాగార్జునతో మంతనాలు జరుపుతున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. అది కూడా నాగ్-అఖిల్‌తో మల్టీ స్టారర్ అని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందని వినిపిస్తోంది. కానీ మరోవైపు మోహన్ రాజా ‘ధృవ’ సీక్వెల్‌ను కూడా ప్లాన్ చేస్తున్నాడు.
పలు సందర్భాల్లో ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు మోహన్. ధృవ తమిళ్ ఒరిజినల్ వెర్షన్ ‘తని ఒరువన్’ని తెరకెక్కించింది మోహన్ రాజానే. దాంతో ఎప్పటి నుంచో ఈ హిట్ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే చరణ్‌కు కథను కూడా వినిపించినట్టు చెప్పాడు. చరణ్ కూడా ఈ సీక్వెల్ చేయడానికి ఆసక్తిగా ఉన్నాడట. దాంతో మోహన్ రాజా నెక్ట్స్ ప్రాజెక్ట్ నాగార్జునతో ఉంటుందా.. లేదా చరణ్‌తో ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.