»Tamil Star Hero Simbu As Villain In Chiranjeevi Vishwambhara
Chiranjeevi: చిరంజీవికి విలన్‌గా తమిళ స్టార్ హీరో?
చివరగా భోళా శంకర్‌తో కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇకపై రీమేక్ సినిమాలు చేయదలుచుకోలేదు. ఈ క్రమంలో విశ్వంభర అనే భారీ సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో కోలీవుడ్ హీరో విలన్‌గా నటిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Tamil star hero Simbu as villain in Chiranjeevi Vishwambhara?
Chiranjeevi: ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ అనే భారీ సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నారు. బింబిసార డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే షూటింగ్ మొదలైన విశ్వంభర సెట్స్‌లోకి ఫిబ్రవరిలో జాయిన్ అవనున్నారు మెగాస్టార్. ఈ షెడ్యూల్లో చిరంజీవి మరియు హీరోయిన్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని టాక్. యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన ముగ్గురు, నలుగురు హీరోయిన్లు నటిస్తున్నట్టుగా సమాచారం. త్రిష, అనుష్క లాంటి సీనియర్ బ్యూటీస్ పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే హీరోయిన్ల విషయంలో క్లారిటీ రానుంది. అయితే విశ్వంభర విలన్ మాత్రం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. విశ్వంభర మేకర్స్ తమిళ్ హీరో హీరో శింబును ఓ కీలక పాత్ర కోసం సంప్రదించినట్టుగా లేటెస్ట్ అప్డేట్. శింబు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. విలన్‌గా మాత్రం శింబు కాకపోయినా ఓ స్టార్ హీరోని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మెగాస్టార్ కెరీర్లోనే హెయెస్ట్ బడ్జెట్‌తో విశ్వంభర తెరకెక్కుతోంది. విజువల్ వండర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.