»Telangana Cm Revanth Reddy Reacted To Kumari Anti Food Stall
Revanth Reddy: కుమారి ఆంటీకిి అండగా తెలంగాణ ప్రభుత్వం
స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసే కుమారి ఆంటీ గురించి ఇప్పుడు అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈవిడ బిజినెస్‌ను మూసివేయాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. దీనిపై ఏకంగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. దీంతో మరోక్కసారి కుమారి వార్తల్లోకి ఎక్కింది.
Telangana CM Revanth Reddy reacted to Kumari anti food stall
Revanth Reddy: సోషల్ మీడియాలో వైరల్ అయిన స్ట్రీట్ ఫుడ్ వెండర్ కుమారి ఆంటీ( Kumari anti ) గురించి అందరికీ తెలుసు. ట్రాఫిక్ తదితర ఇబ్బందుల కారణంగా ఫుడ్ స్టాల్ తొలగించమని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ విషయంలో ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పందించారు. ఫుడ్ స్టాల్‌కు అనుమతి ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. తన వ్యాపారం ఎప్పటిలాగే కొనసాగించుకునేలా చూడాలని పోలీసులకు సూచించారు. అక్కడ ట్రాఫిక్ జామ్ అవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలిని అన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి సీపీఆర్వో ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షమే ఉంటుందని, స్వయం ఉపాధి పొందుతున్న వారికి అండగా ఉంటుందని పోస్ట్‌లో వెల్లడించారు. ఈ మహానగరంలో రోజు కొన్ని వేల మందికి ఈ స్ట్రీట్ ఫుడ్ స్టాల్సే కడుపునింపుతున్నాయి. తక్కువ ధరతో మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ.. తన మాటలతో ఫేమస్ అయిన కుమారి అదే పాపులారిటీ కారణంగా ఇంత పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా యూట్యూబర్స్ తన ఫుడ్ స్టాల్ దగ్గర హడావిడీ చేయకుండా ఉండాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.