Ganguly Biopic : ప్రముఖుల బయోపిక్ సినిమాలకు ఎప్పుడు డిమాండే. ఇప్పటికే చాలా మంది బయోపిక్స్ వచ్చాయి. ముఖ్యంగా క్రికెటర్స్ బయోపిక్ అంటే.. జనాల్లో భలే క్రేజ్ ఉంటుంది.
ప్రముఖుల బయోపిక్ సినిమాలకు ఎప్పుడు డిమాండే. ఇప్పటికే చాలా మంది బయోపిక్స్ వచ్చాయి. ముఖ్యంగా క్రికెటర్స్ బయోపిక్ అంటే.. జనాల్లో భలే క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే ధోని, కపిల్ దేవ్ వంటి స్టార్ క్రికెటర్ల జీవితం ఆధారంగా సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు గంగూలీ వంతు వచ్చింది. వాస్తవానికి సౌరవ్ గంగూలీ బయోపిక్ గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే హీరో మాత్రం ఖరారు కావడం లేదు. గతంలో హృతిక్ రోషన్, సిద్ధార్థ్ మల్హోత్రా వంటి స్టార్ హీరోల పేర్లు వినిపించినా.. ఇప్పుడు ఓ స్టార్ హీరో దాదాపుగా ఫిక్స్ అయ్యాడనే తెలుస్తోంది. బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్, గంగూలీ బయోపిక్‌లో నటించబోతున్నాడట. ఇటీవలె బ్రహ్మాస్త్ర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు రణ్‌బీర్. ప్రస్తుతం ఆయన నటించిన ‘తు ఝూటీ మై మక్కర్’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ‘యానిమల్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాల తర్వాత సౌరవ్ గంగూలీగా కనిపించడానికి రెడీ అవుతున్నాడట రణ్‌బీర్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కోల్‌కతాలో స్టార్ట్ వనుందని అంటున్నారు. అందులోభాగంగా.. ముందుగానే కోల్‌కతాను సందర్శించనున్నాడట రణబీర్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోందని అంటున్నారు.