ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తైంది. రీసెంట్గా లండన్ టూర్ నుంచి మహేష్ తిరిగిరావడంతో.. నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ మధ్యలో స్క్రిప్ట్ విషయంలో పలు పుకార్లు వినిపించాయి.
ఫస్ట్ షెడ్యూల్ తర్వాత మహేష్ పలు మార్పులు చెప్పాడని.. దాంతో ఈ సినిమా మరింత లేట్ అవుతుందని వినిపించింది. అయితే ఇప్పుడు మహేష్, త్రివిక్రమ్‌ల మధ్య మళ్లీ కొన్ని చర్చలు జరిగాయని తెలుస్తోంది. ఫైనల్‌గా మాటల మాంత్రికుడు.. మహేష్‌ను మెప్పించినట్టు టాక్. దాంతో తిరిగి వర్క్ మూడ్‌లోకి వచ్చేశాడట సూపర్ స్టార్. తాజాగా సెకండ్ షెడ్యూల్ టైం ఫిక్స్ అయినట్టు సమాచారం.
నవంబర్ మూడో వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఇక ఈ షెడ్యూల్ నాన్ స్టాప్‌గా జరగనుందట.. ఇందులో హీరోయిన్ పూజా హెగ్డే కూడా జాయిన్ కాబోతుంది. అయితే ప్రస్తుతం లెగ్ పెయిన్‌తో బాధపడుతున్న పూజా.. రెస్ట్ మోడ్‌లో ఉంది. దాంతో మంత్ ఎండింగ్లో షూటింగ్లో పాల్గొంటుందని తెలుస్తుంది.
ఈ షెడ్యూల్లో మహేష్ పూజా హెగ్డేలపై కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేస్తారని తెలుస్తుంది. ఇకపోతే తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను.. వచ్చే ఏడాది ఏప్రిల్ 28 గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత రాజమౌళి సినిమా మొదలు పెట్టనున్నాడు మహేష్. ఈ సినిమాతోనే పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాడు మహేష్.