Spirit: ప్రభాస్ పోలీస్ క్యారెక్టర్ మామూలుగా ఉండదు!
ఇండస్ట్రీలో ప్రభాస్ది చాలా ఫ్రెండ్లీ నేచర్. ప్రతి ఒక్కరిని డార్లింగ్ అని పిలుస్తూ చాలా కూల్‌గా ఉంటాడు. కానీ సినిమాల్లో ప్రభాస్‌తో మామూలుగా ఉండదు. అది కూడా ఖాకీ చొక్కా వేస్తే? అదిరిపోతుందని స్పిరిట్ మేకర్స్ చెబుతున్నారు.
Spirit: సినిమాల్లో కాకుండా బయట ప్రభాస్‌ను కోపంగా చూసిన సందర్భాలు చాలా తక్కువ. కానీ సినిమాల్లో మాత్రం ప్రభాస్ చాలా పవర్ ఫుల్‌గా కనిపిస్తాడు. సలార్‌లో సినిమాలోను ప్రశాంత్ నీల్ అలాగే చూపించాడు. ప్రభాస కటౌట్‌ని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు. ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్‌కు ప్రస్తుతం సలార్ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ లైన్లో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సలార్ 2 ఎప్పుడుంటుందో తెలియదు గానీ.. నెక్స్ట్ మాత్రం నాగ్ అశ్విన్ ‘కల్కి’ ఆడియెన్స్ ముందుకు రానుంది. ఆ తర్వాత మారుతి సినిమా రెడీ అవుతోంది. ఇక ఆ తర్వాత రాబోయే సినిమా పై ఇప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి.
అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగతో.. గతంలోనే స్పిరిట్ అనౌన్స్ చేశాడు ప్రభాస్. వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మామూలుగానే సందీప్ తన హీరోలను చాలా వైలెంట్‌గా చూపిస్తాడు. అలాంటిది.. ప్రభాస్ లాంటి కటౌట్‌ని ఇంకెంత వైలెంట్‌గా చూపిస్తాడో ఊహించుకోవచ్చు. స్పిరిట్‌లో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.
ప్రభాస్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్న ఫస్ట్ సినిమా స్పిరిట్‌నే. ఇదే విషయాన్ని తాజాగా కన్ఫామ్ చేశారు సందీప్ రెడ్డి బ్రదర్ నిర్మాత ప్రణయ్ రెడ్డి. ‘ప్రభాస్ కెరీర్లోనే ఫస్ట్ టైం పోలీస్ డ్రెస్‌లో కనిపించనున్నారు. సందీప్ రెడ్డి గత చిత్రాల్లో హీరోల క్యారెక్టర్ ఎలా ఉంటుందో ‘స్పిరిట్’లో ప్రభాస్ పాత్ర కూడా అలానే ఉంటుంది. యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా కనిపిస్తాడని.. చెప్పుకొచ్చాడు. దీంతో స్పిరిట్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్‌ను ఎంత పవర్ ఫుల్‌గా చూపిస్తాడో చూడాలి.