ప్రభాస్ కెరీర్లో ఆదిపురుష్ ఓ మైలు రాయిగా నిలుస్తుందని.. ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పుడు సంబర పడ్డారు అభిమానులు. కానీ ఏ ముహుర్తాన ఆదిపురుష్ మూవీని మొదలు పెట్టారో కానీ.. ఆది నుంచి అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా మొదలు పెట్టి రెండేళ్లు దాటిపోయింది. డైరెక్టర్ ఓం రౌత్ ఆదిపురుష్‌ను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నాడు కాబట్టి..
ఇంత సమయం తీసుకుంటున్నాడు. కానీ టీజర్లో విజువల్స్ చూశాక.. అసలు ఓం రౌత్ ఏం చేస్తున్నాడే సందేహాలు వెలువడుతున్నాయి. అందుకే ఆదిపురుష్‌ను మరో ఆరు నెలలు పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా.. కొత్త డేట్ జూన్ 16 అంటూ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆదిపురుష్ మరోసారి పోస్ట్ పోన్ అవనుందనే న్యూస్ వైరల్‌గా మారింది.
ఏకంగా ఈ సినిమా 2024లో థియేటర్లోకి రానుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో అనేది తెలియదు గానీ.. ఇదే జరిగితే అనుకున్న సమయానికే.. అంటే సెప్టెంబర్ 28న, సలార్ రిలీజ్ అవనుందని అంటున్నారు. అలాగే ఆదిపురుష్ అసలు రిలీజ్ అవుతుందా అనే సందేహాలు కూడా వెలువడుతున్నాయి.
కానీ ప్రభాస్ నుంచి ముందుగా సలార్ వస్తే.. ఫ్యాన్స్‌కు పునకాలేనని చెప్పొచ్చు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ కావడంతో.. సలార్ పై భారీ అంచనాలున్నాయి. అందుకే మిగతా సినిమా సంగతేమో గానీ.. సలార్‌ను ముందుగా రిలీజ్ చేయాలని అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే ఇప్పుడు అదే జరగబోతోందని చెప్పొచ్చు. మరి నిజంగానే ఆదిపురుష్ మరోసారి వాయిదా పడుతుందేమో చూడాలి.