Selvaraghavan: సంచలన ట్వీట్.. స్టార్ డైరెక్టర్‌ను చంపేసిన నెటిజన్!
ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యామా అని.. ఏ విషయమైనా సరే క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. ఎక్కడ ఏం జరిగినా.. క్షణాల్లో అరచేతిలో ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీస్ పై ఎలాంటి ట్వీట్స్ వేసినా.. వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్‌ను చనిపోయినట్టున్నాడంటూ.. ట్వీట్ వేశాడు ఓ నెటిజన్. దానికి అదిరిపోయే రిప్లే ఇచ్చాడు సదరు డైరెక్టర్. ప్రస్తుతం ఆయన లైమ్‌లైట్‌లో లేకపోవచ్చు కానీ.. తను చేసిన సినిమాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గానే ఉన్నాయి. ఇంతకీ ఎవరా డైరెక్టర్!?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ బ్రదర్‌గా కంటే.. దర్శకుడిగానే సెల్వరాఘవన్ అందరికీ పరిచయం. సెల్వా చేసిన సినిమాలు అలాంటివి మరి. తెలుగులోను ఆయన సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా కుర్రాళ్ల గుండెలను పిండేశాయి. 7జి బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, యుగానికి ఒక్కడు సినిమాలు చూసిన వారికి.. సెల్వ టాలెంట్ గురించి తెలుస్తుంది. అయితే గత కొంత కాలంగా సెల్వ సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. ఈ మధ్యే తమ్ముడు ధనుష్‌తో ‘నేనే వస్తున్నా’ అనే సినిమా చేశాడు. అయినా కూడా సెల్వ డిసప్పాయింట్ అయ్యాడు. ప్రస్తుతం సెల్వ కొన్ని సినిమాల్లో నటుడిగాను రాణిస్తున్నాడు.
సెల్వరాఘవన్ చేసిన ట్వీట్:
Why my friend ? I'm not dead or retired. I have just spent some time for myself. I'm just in my forties .. And I'm back. https://t.co/CYdLcoG97k
ఆ మధ్యన కీర్తి సురేష్‌తో ఓ సినిమాలో లీడ్ రోల్ పోషించాడు. అయినా కూడా సెల్వపై ఊహించని కామెంట్ చేశాడు ఓ నెటిజన్. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సెల్వ ఊరికే ఉంటాడా? సదరు నెటిజన్‌కు దిమ్మ తిరిగిపోయే రిప్లే ఇచ్చాడు. సెల్వ ఫస్ట్ ఫిల్మ్ ‘తుళ్లువదో ఇలామై’ సినిమాలోని ఫొటోను షేర్ చేసిన ఓ అభిమాని..’ఈ మువీ దర్శకుడు చనిపోయినట్లున్నారు.. లేదంటే సినిమాలు తీయడం ఆపేసైనా ఉండాలి’.. అంటూ తమిళ్లో ట్వీట్ చేశారు. దీనికి సెల్వరాఘవన్ ‘ఫ్రెండ్.. నేను ఇంకా చనిపోలేదు.. Why my friend ? I’m not dead or retired. I have just spent some time for myself. I’m just in my forties .. And I’m back.. అంటూ రిప్లే ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏదేమైనా సోషల్ మీడియా వచ్చాక.. ఇలాంటివి కామన్ అయిపోయాయి.