రీసెంట్‌గానే యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది సమంత. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతోంది సామ్. ఇక ఇదే జోష్‌లో అప్ కమింగ్ సినిమాలు చేసేందుకు సై అంటోందట. అయితే ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది సమంత. దాంతో ఇప్పట్లో ఈ ముద్దుగుమ్మ షూటింగ్లో జాయిన్ అయ్యే అవకాశాలు తక్కువ.
కానీ త్వరలోనే కోలుకుంటాననే గట్టి నమ్మకంతో ఉంది సామ్. అందుకే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో గుణ శేఖర్ ‘శాకుంతలం’ మూవీతో పాటు.. విజయ్ దేరకొండ సరసన ‘ఖుషి’ అనే సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్లో పలు భారీ ప్రాజెక్ట్స్‌తో పాటు.. వరుణ్ ధావన్ సరసన ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. ఇక ఇప్పుడు మరో లేడీ ఓరియెంట్ సినిమాకు కమిట్ అయినట్టు తెలుస్తోంది. గతంలో చిలసౌ, నాగార్జునతో మన్మథుడు 2 వంటి సినిమాలకు డైరెక్షన్ చేశాడు రాహుల్ రవీంద్రన్.
ఆ తర్వాత ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాను చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మధ్యలో రష్మికతో ఈ ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉందని వినిపించింది. కానీ అమ్మడు ఈ ప్రాజెక్ట్‌ను పక్కకు పెట్టేసింది. దాంతో ఇదే కథతో సమంతను లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే సమంత లేటెస్ట్ ఫిల్మ్ ‘యశోద’ను సోషల్ మీడియాతో తెగ ప్రమోట్ చేస్తున్నాడని అంటున్నారు.
పైగా రాహుల్ భార్య చిన్మయి, సమంత మంచి ఫ్రెండ్స్. సమంత నటించిన చాలా సినిమాలకు చిన్మయి డబ్బింగ్ చెప్పింది. అందుకే ఈ సినిమాకు సామ్ ఓకే చెప్పినట్టు టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అఫిషీయల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు.