Samantha: దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. సినీ ఇండస్ట్రీ వారికి ఈ సామెత వర్తిస్తోంది. ముఖ్యంగా హీరోయిన్లకు కరెక్టుగా సరిపోతుంది. అందుకే హీరోయిన్స్ క్షణం తీరిక లేకుండా మూవీస్ చేస్తుంటారు. హీరోయిన్ సమంత (Samantha) అందుకు ఉదహరణ. అవును ఏ మూవీ అయినా సరే.. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా ముందడుగు వేస్తున్నారు.
లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నప్పటికీ.. అవీ ఎంతోకాలం చేయలేం అని సమంతకు (Samantha) తెలుసు. అందుకే యశోద (yashoda) ఏ రేంజ్లో ఆడినప్పటికీ.. శాకుంతలం చేసింది. ఆ మూవీ అట్టర్ ఫ్లాప్ అయిన ఖుషీ అనే మూవీ చేస్తోంది. చెన్నై స్టోరీ (chennai story) అనే మరో సినిమాలో నటిస్తోంది అమ్మడు. సిటాడెల్ హిందీ వెబ్ సిరీస్ కూడా చేస్తుందని తెలిసిందే.ఇటు ఖుషి మూవీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ (vijay devarakonda) నటిస్తున్నాడు. ఇందులో చైతన్య (chaitanya) నటించాలి. కానీ వారిద్దరూ వీడిపోవడంతో.. విజయ్‌కు (vijay) అవకాశం వచ్చింది.
సమంత (samantha) వయస్సు 36 ఏళ్లు.. అంటే మూడు, నుంచి నాలుగేళ్లు ఇండస్ట్రీలో ఉంటుంది. తర్వాత సీనియర్ హీరోలతో లేదంటే సైడ్ క్యారెక్టర్స్.. అక్క, వదిన పాత్రలే వస్తాయి. సో ఆ లోపు సంపాదించుకోవాలని అనుకుంటోంది. ఏ సినిమా ముందుకు వచ్చిన ఓకే చెబుతోంది సామ్. ఈ మూడేళ్లలో కనీసం ఓ పది సినిమాలు చేసి.. చేతినిండా సంపాదించుకోవాలని అనుకుంటుందట.