హరి హరీష్ దర్శకత్వంలో సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘యశోద’ నవంబర్ 11న విడుదల కానుంది. దాంతో ప్రమోషన్స్ స్పీడప్ చేసింది చిత్ర యూనిట్. అయితే సమంత హెల్త్ ప్రాబ్రమ్ వల్ల ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటుందని అనుకున్నారు. కానీ సామ్ మాత్రం ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది. ఇక ప్రమోషన్లో భాగంగా.. సినిమా గురించి, తన వ్యాధి గురించి పలు విషయాలని తెలిపింది.
ఈక్రమంలో తన అనారోగ్యం గురించి సుమ అడుగ్గా.. ఎమోషనల్ అయింది సమంత.. కన్నీళ్లు ఆపుకోలేక బోరున ఏడ్చేసింది. ‘మంచి రోజు వస్తాయి, చెడు రోజులూ ఉంటాయి.. దాని ప్రకారమే ఇంతవరకు వచ్చాం.. ఇంకొక్క అడుగు ముందుకు వేయలేను అనిపిస్తుంది.. కొన్ని రోజులు తిరిగి చూస్తుంటే ఇంత దాటేసి వచ్చేసానా అనిపిస్తుంది.. నేను ఇంకా చావలేదు.. ప్రస్తుతం చాలా డిఫికల్ట్ పొజిషన్లో ఉన్నానని చెప్పింది. అలాగే వాటినుంచి త్వరగా బయటపడతాననే ధీమాను వ్యక్తం చేసింది. అలాగే ‘సోషల్ మీడియాలో కొన్ని ఆర్టికల్స్ చూశాను.. చాలా మంది నేను చనిపోయే ప్రమాదముందని చెబుతున్నారు.
ప్రస్తుతానికైతే ఇంకా బతికే ఉన్నాను.. కాబట్టి అలాంటి హెడ్ లైన్లు రాయాల్సిన అవసరం లేదని చెప్పింది. ఇక సినిమా గురించి చెబుతూ.. ‘యశోద’ కథ విని షాక్ అయ్యాను, స్టోరీ విన్నప్పుడు గూజ్ బంప్స్ వచ్చాయి. రేపు థియేటర్లలో చూసిన ఆడియన్స్ కూడా అలాగే ఫీల్ అవుతారని చెప్పింది. అలాగే తనకు డాన్స్ చేయటం కంటే ఫైట్స్ చేయటమే ఇష్టమని.. ఈ సినిమాలో మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయని చెప్పుకొచ్చింది. మొత్తంగా ఇప్పుడు సమంత ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.